Share News

అరచేతిలో స్వర్గాన్ని చూపిన మాజీ మంత్రి కేటీఆర్‌

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:41 AM

పదేళ్లలో కోట్ల రూపాయలతో సిరి సిల్ల మున్సిపల్‌ పరిధిలోని వార్డులను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే, మాజీ మం త్రి కేటీఆర్‌ ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపించాడని కాంగ్రెస్‌ సిరిసిల్ల ని యోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

అరచేతిలో స్వర్గాన్ని చూపిన మాజీ మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల టౌన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : పదేళ్లలో కోట్ల రూపాయలతో సిరి సిల్ల మున్సిపల్‌ పరిధిలోని వార్డులను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే, మాజీ మం త్రి కేటీఆర్‌ ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపించాడని కాంగ్రెస్‌ సిరిసిల్ల ని యోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో సిరిసిల్ల పట్టణం తోపాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు. గత సంవ త్సరంలో సిరిసిల్ల పట్టణంలో వివిధ పనుల కోసం ఎస్‌డీఎఫ్‌ నిధులు కోటి 25 లక్షలు మంజూరు చేయగా, కొన్ని పనులను పూర్తి అయ్యాయన్నారు. వివిధ పనుల నిమిత్తం యూడీఎఫ్‌ కింద రూ.18 కోట్ల 70లక్షలు మంజూరు చేశారన్నా రు. ఈనిధులతో డ్రైనేజీ, అంతర్గత, సీసీరోడ్ల నిర్మాణం చేపట్టనున్నారన్నారు. ఈ అభివృద్ధి పనులతో సిరిసిల్ల పట్టణంలో శాశ్వతంగా రోడ్లు, డైనేజీల సమస్యకు పరిష్కారం జరుగుతుందన్నారు. ఈనెల 22తో టెండర్ల ప్రక్రియ మొత్తం ముగు స్తుందన్నారు. విలీన గ్రామ ప్రజలకు తాము కూడా సిరిసిల్ల పట్టణంలో అంత ర్భాగమే అని ధైర్యాన్ని కల్పించే దిశగా ఈ పనులను చేస్తున్నామన్నారు. నాణ్య మైన డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు చేసి పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి కోసం ప్రణా ళికలు వేసే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం, స్థానిక నాయకత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో దాదా పు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8కోట్లు, ఎల్‌వోసీలు దాదాపు రూ.50 లక్షలు వరకు ఇచ్చామన్నారు. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 900 మందికి ఇంది రమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. ఈసమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ము ల స్వరూపతిరుపతిరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మహిళ కాం గ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దుబాల వెంకటేశం, మాజీ కౌన్సి లర్లు కత్తెర దేవదాస్‌, లక్ష్మీనర్సయ్య, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:41 AM