ఫామ్‌హౌస్‌కు పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:35 AM
శాసన సభలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిప క్ష పాత్ర పోషించాల్సిన మాజీ ముఖ్యమంత్రి పామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని, మాజీ మం త్రులుగా చేసినవారు ప్రజా సమస్యలపై మాట్లా డడం లేదని, మరోవైపు ఇంకా దళితులు అంటే చిన్నచూపు చూస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): శాసన సభలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిప క్ష పాత్ర పోషించాల్సిన మాజీ ముఖ్యమంత్రి పామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని, మాజీ మం త్రులుగా చేసినవారు ప్రజా సమస్యలపై మాట్లా డడం లేదని, మరోవైపు ఇంకా దళితులు అంటే చిన్నచూపు చూస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో కాం గ్రెస్ జిల్లా కార్యాలయ భవనంలో సిరిసిల్ల పట్ట ణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 30న జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ సన్నా హక సమావేశం నిర్వహించారు. అనంతరం శాంతినగర్‌లో రైతుల సమస్యలు విన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద చేసిన దౌర్జన్యానికి నిరసన తెలిపి వస్తే దళితు లు నిలబడ్డ చోట పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించేలా ప్రవర్తించిన సంఘటనకు చిం తించాల్సింది పోయి దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ చెబుతున్న బీఆర్‌ఎస్ నాయకులు తమ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, సిరిసిల్లలో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయ వంతం చేయాలని. సిరిసిల్లలో భూ భాగోతం, దోపిడీ చిట్టాలను ముఖ్యమంత్రి విప్పడానికి వస్తున్నాడని అన్నారు.సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న సాగునీటి, మౌలిక సదుపాయాల, కార్మికుల, పేదల సమస్యల పరిష్కారం కోసం ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. గోదా వరి తీరంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, వేములవాడ, కొండగట్టు తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.రైతులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంతో పాటు ప్రజాపాలనను ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్లలో లక్ష మందితో నిర్వహించడానికి తలపెట్టిన ము ఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ నుంచి సాయంత్రం 4 గంట లకు సిరిసిల్ల కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని అక్కడి నుంచి అంబేద్క ర్ చౌరస్తా వద్ద నుంచి పాదయాత్రగా సభ స్థలం వరకు వెళ్తారని అన్నారు. సిరిసిల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఇవ్వడమే కాకుండా కార్మికు లకు చేతినిండా పని ఉండే విధంగా 6.67 కోట్ల మీటర్ల స్వశక్తి చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ఇచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 13 వేల అంత్యోదయ కార్డులను బీఆర్ ఎస్ తొలగించిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వం రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇచ్చింద న్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదవ ప్యాకేజీ పనులను చేయలేక పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మల్కపేట రిజర్వాయర్ నుంచి 5వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, బీజేపీ 9వ ప్యాకేజీ పనులపై పాదయాత్ర చేస్తామనడం హాస్యాస్ప దంగా ఉందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కేకే మహేందర్ రెడ్డిలో మాట్లాడుతూ అధికారం కోల్పోయిన అహంకారంతో బీఆర్‌ఎస్ నాయకు లు మాట్లాడుతున్నారని, బహిరంగ సభను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రంథాల య సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, నాయకులు గడ్డం నర్సయ్య, చొప్పదండి ప్రకాష్, అకునూరి బాలరాజు,స్వరూపరెడ్డి, వనిత, యెల్లే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.