ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:56 PM
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరు తడి పంటలు సాగుపై దృష్టి సారించాలని కలె క్టర్ గరిమ అగ్రవాల్ రైతులకు సూచించారు.
బోయినపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరు తడి పంటలు సాగుపై దృష్టి సారించాలని కలె క్టర్ గరిమ అగ్రవాల్ రైతులకు సూచించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంట లపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మం గళవారం బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నిర్వహించిన కేత్ బచావో అభియాన్, రైతు నేస్తం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక ఎకరా వరి సాగుకు సుమారు 35నుంచి 40లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు. నీటితో పాటు విద్యుత్ వినియోగం కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలి స్తే భూగర్భ జలమట్టం 2.27మీటర్ల మేర తగ్గిందని వివరించారు. రిజర్వాయర్లలో అందు బాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు, పశువుల తాగునీటికి ప్రాధాన్యమిస్తూ వినియో గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాతా వరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. బోయి నపల్లి మండల రైతులు గత సీజన్‌లో ప్రత్యా మ్నాయ పంటల సాగులో ముందుండటం అభినందనీయమన్నారు. ఆయిల్‌పామ్ సాగు పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు రైతులు సానుకూలంగా స్పందించారన్నారు.
ఆరుతడి పంటలతో ఆదాయం..
ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగిలో నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఆయిల్‌పామ్ వం టి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.బిందుసేద్యం, తుంపర సేద్యం వంటి ఆధునిక సాగు పద్ధతు లను అనుసరించి నీటిని సమర్థంగా వినియో గించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు రూ.23.641 ఉందని తెలి పారు. జిల్లాకు సమీపంలోని సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉందని, మండలంలోనే ఉత్పత్తుల సేకరణ కేంద్రం ఉం డటం రైతులకు అనుకూలమన్నారు. ప్రత్యా మ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు రైతులు ఆదాయం పెంచుకునే అవకాశాలున్నాయని వివరించారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు), రైతు ఉతఁత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీ ఓలు), స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యవ సాయ యాంత్రీకర ణ, ప్రభుత్వ పథకా ల వినియోగం, ప్రత్యామ్నాయ పంట ల సాగుపై అవగా హన కల్పించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పలు అంశాలపై వివరించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ఫలి తంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగా యల సాగు విస్తీర్ణం పెరిగినట్లు వివరించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేయాల న్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముందుగంటి సురేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసా య అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ షరీ ఫోద్దీన్, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్, ఏవో కే. ప్రణీత, సర్పంచ్ కనకయ్య పాల్గొన్నారు.