ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:01 AM
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
సిరిసిల్ల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగు, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై హైద రాబాద్ నుంచి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించగా, రాజ న్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహించే ప్రత్యామ్నా య పంటల విత్తన మేళాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పంటల వైవిధ్యీకరణలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలను ప్రభుత్వం అభినందిస్తుందని, వారు అమలు చేసిన కార్యాచరణను ఇత ర జిల్లాల్లో కూడా అమలుచేస్తామని తెలిపారు. కంది, పెసర, మిను ములు, ఇతర పప్పు ధాన్యాలు, అలసందలు, పొద్దుతిరుగుడు, కూరగా యలు, చిరుధాన్యాలు వంటి పంటలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. వచ్చేనెల 30 వ తేదీ వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని సూచిం చారు. పాఠశాల యూనిఫాంల సరఫరా నిర్ణీత గడువులో ఈ ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు.
ఎకరం కూడా ఖాళీగా వదలవద్దు..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. నీటి వనరులు ఉన్న రైతులు మిన హా మిగతా వ్యవసాయభూములు ఖాళీగా వదిలేయకుండా చూడాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు సాగు చేసే లా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయా పంటలకు సంబంధిం చిన అన్ని విత్తనాలు సిద్ధంగా పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశా లకు అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యా లయాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు నిర్ణీత గడువు లోపు అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికా రుల పరస్పర సమన్వయంతో పని చేస్తూ సకాలంలో విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు అందేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివా సాచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా విద్యాధి కారి మొండయ్య, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమల త, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.