Share News

ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలపై దృష్టి

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:03 AM

ఎల్‌నినోతో వర్షాభావం తక్కువగా ఉండ నున్న నేపథ్యంలో వ్యవసాయంపై తీవ్ర ప్రభా వం చూపనుందని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలపై దృష్టి

వేములవాడ రూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్ర జ్యోతి): ఎల్‌నినోతో వర్షాభావం తక్కువగా ఉండ నున్న నేపథ్యంలో వ్యవసాయంపై తీవ్ర ప్రభా వం చూపనుందని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. నూకలమర్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవా రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ సాగును చేపట్టాలన్నారు. వర్షాభావ నేపథ్యంలో ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాల న్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, ప్యాక్స్‌ చైర్మన్‌ వకులాభరణం శ్రీనివాస్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ ముకుందరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్‌, నా యకులు సోమినేని బాలు, వెంకటేశం, ప్రవీణ్‌, వ్యవసాయ శాఖ అధికారి వినితరెడ్డి, మహిళా సంఘం సభ్యులు,సర్పంచులు, నాయకులు రైతు లు పాల్గొన్నారు. కాగా గ్రామంలోని డీ9 కాలువ వద్ద ఊరవానిచెరువుకు చేరుకునేందుకు వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌కు వినతిపత్రం అందజశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యేను కలిసిన మార్కెట్‌ కమిటీ పాలకవర్గం

వేములవాడ మార్కెట్‌ కమిటీ పాలకవ ర్గం ప్రభుత్వవిప్‌ వేములవాడ ఎమ్మెల్యే ను శుక్రవారం ఆయన క్యాంపు కార్యాల యంలో మర్యాద పూర్వకంగా కలిశాారు. మార్కెట్‌ కమిటీ అభివృధ్దికి ప్రభుత్వం రూ. 3.94కోట్లు నిధులు మంజూరు చేసిన నేప థ్యంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ కనిక రపు రాకేష్‌ డైరెక్టర్లు ఖమ్మం గణేష్‌, వస్తాని కృష్ణ, పాలకూర్తి పర్శరాములు, చీకటి నాగరాజు, రాగిరి నాగరాజు, పర్శరాములు, సాబీర్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:03 AM