స్వయంఉపాధిపై దృష్టి సారించాలి
ABN , Publish Date - May 20 , 2026 | 12:19 AM
ఉద్యో గాలతో పాటు స్వయం ఉపాధిపై దృష్టి సారించాల ని,నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సిరిసిల్ల అర్బన్, మే 19 (ఆంధ్రజ్యోతి) : ఉద్యో గాలతో పాటు స్వయం ఉపాధిపై దృష్టి సారించాల ని,నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగం గా 23వ తేదీవరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లోని స మావేశ మందిరంలో మంగళవారం నైపుణాభివృ ద్ధిపై అవగహన సదస్సును నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వివిఽధ శిక్షణ సంస్థలు ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఆర్‌సేటీ, జీఎంఅర్, ఐడీటీఆర్, ట్రాస్క్ ఇతర సంస్థల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఏయే కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు, అర్హత తదితర అంశాలపై కలెక్టర్ అడిగితెలుసుకు న్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మా ట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటీవల విద్యా శాఖ వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఎన్నో అంశాల్లో ప్రతిభ చూపారని గుర్తు చేశారు. విద్యతోపాటు ఆటలు ఆడాలని, దీంతో శారీరక, మాన సిక సమతుల్యత ఉంటుందని, క్రమ శిక్షణలు ఎంతో ఉపయోగపడుతా యని వివరించారు. ఉన్నత చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌లను నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటి పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ అవసరమో తెలుసుకొని ఆ దిశలో ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ఐటీఐ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఆర్‌సేటీ, జీఎంఆర్, ఐడీ టీఆర్, టాస్క్ తదితర సంస్థల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ కోర్సులను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఆయా సంస్థ ల్లోని ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో శిక్షణ పొందిన వారికి పలు సంస్థలు ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. పరిశ్రమల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంది స్తున్న స్వయం ఉపాధి స్కీములు, సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. వివిధ శిక్షణ సంస్థలు ఏడాదంతా యువతకు శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నర్సింగ్ పూర్తి చేసి విదేశాల భాష, నైపుణ్యాల్లో పట్టున్నవారికి టామ్‌కామ్ ఆధ్వర్యం లో వివిధ దేశాల్లో ఉపాధి కల్పన అవకాశాలు ఉన్నాయని వెల్లడించా రు. జిల్లా నుంచి ఇప్పటిదాకా 45 మందికి విదేశాల్లో కొలువులు వచ్చా యని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత ఉపాధిని పొంది తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్య తను చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, పరిశ్రమల శాఖ జీఎం హను మంతు, డీవైఎస్‌వో రాందాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఎల్డీఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.