Share News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:49 AM

రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి
రైతులతో మాట్లాడుతున్న డీఏవో భాస్కర్‌

డీఏవో భాస్కర్‌

కొడిమ్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్‌ అన్నారు. గురువారం మండలంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నార్మల్‌ ఫార్మింగ్‌ పథకంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మండలంలో ఎంపికైన శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గోగూరి గోపాల్‌రెడ్డికి చెందిన పశువుల ఫారంను డీఏవో సందర్శించారు. సేంద్రీయ పద్దతిలో సాగు చేస్తున్న కూరగాయాల పంటలు, డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట, ఆయిల్‌ ఫాం తోటలను సందర్శించి అదిక దిగుడబడిని పొందటానికి తీసుకోవాలసిన పలు సూచనలను రైతులకు చేసారు. అనంతరం డీఏవో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడిని సాదించవచ్చునని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రాజులనాయుడు, టెక్నీకల్‌ ఏవో శ్రీనివాస్‌, ఏఈవో రాజేష్‌, మల్యాల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డ్డి, మాజీ ఇన్‌చార్జ్‌ సర్పంచు శ్రీనివాస్‌రెడ్డ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:50 AM