Share News

పిల్లల కదలికలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - May 25 , 2026 | 12:29 AM

పిల్లల కదలికలపై తల్లిదం డ్రులు నిత్యం దృష్టి సారించాలని అలాగే ఈత పేరుతో పిల్లల ప్రాణా లనుకొల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాల ని ఎస్పీ మహేష్‌ బీ గీతే కోరారు.

పిల్లల కదలికలపై దృష్టి సారించాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 24 (ఆంధ్ర జ్యోతి) : పిల్లల కదలికలపై తల్లిదం డ్రులు నిత్యం దృష్టి సారించాలని అలాగే ఈత పేరుతో పిల్లల ప్రాణా లనుకొల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాల ని ఎస్పీ మహేష్‌ బీ గీతే కోరారు. సిరి సిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వేసవి కాలం లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడినుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి చెరు వులు, కుంటలు, కాలువల వద్దకు వెళితే నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్ర త్తలు తీసుకోవాలని ఈతసరదా విషాదంగా మారకూడదని సూచించారు. ఈతరానివారు బావులు, చెరువులు, కుంటలు, కాలువల వద్దకు ఒంటరి గా వెళ్లవద్దని ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవా లని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పిల్లల ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల కదలి కలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఎస్పీ కోరారు.

Updated Date - May 25 , 2026 | 12:29 AM