Share News

సెల్‌ఫోన్ల రికవరీలో ప్రథమ స్థానం

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:54 PM

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల రికవరీలో సిరిసిల్ల జిల్లా పోలీసులు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవ డం నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా విని యోగించిన తీరుకు నిదర్శమని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు.

సెల్‌ఫోన్ల రికవరీలో ప్రథమ స్థానం

సిరిసిల్ల అర్బన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల రికవరీలో సిరిసిల్ల జిల్లా పోలీసులు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవ డం నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా విని యోగించిన తీరుకు నిదర్శమని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సెల్‌ఫోన్‌ రికవరీ మేళాలో సుమారు రూ.13లక్షల విలువైన 90 సెల్‌ఫోన్‌లను యజమానులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేరని, విలువైన సమాచారం బ్యాంక్‌ అకౌంట్స్‌, పాస్‌వర్డ్‌ల వంటివి సేవ్‌ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు సెల్‌ఫోన్‌లను దొంగిలించి, వీక్‌పాస్‌వర్డ్స్‌లను బ్రేక్‌ చేసి ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. సెల్‌ఫోన్‌లను పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్‌ ఫోన్‌ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచా రంతో సహా డబ్బులను కూడా కోల్పోతున్నారన్నారు. ఎవరైనా మొబైల్‌ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో సెల్‌ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసి, సంబంధిత పోలీసుస్టేషన్‌లో సమాచా రం ఇవ్వాలని సూచించారు. సెకండ్‌హ్యాండ్‌ సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా సంబంధిత సెల్‌ఫోన్‌ల దుకాణాల యజమాని నుంచి రసీదు తీసుకోవాలని, తక్కువ ధరకు లభిస్తుందని భావించి, దొంగిలించబడిన ఫోన్‌ అని తెలియక కొనుగోలు చేసిన అమాయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దొంగిలించబడిన సెల్‌ ఫోన్‌ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొబైల్‌ ఫోన్‌ అమ్మాలనుకునే వారు తప్పనిసరిగా సంబంధిత కంపెనీలకు ఎక్ఛేం జీలో విక్రయించాలి తప్ప తెలియని వ్యక్తులతో పాటు అనధికారిక సెల్‌ఫోన్‌ దుకాణాలకు విక్రయించవద్దన్నారు. ఇటువంటి సెల్‌ ఫోన్లు సైబర్‌ నేరాలకు వినియోగించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. సీఈఐఆర్‌ అప్లికేషన్‌ ద్వారా జిల్లాలో పోయిన సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగిం చడంలో కృషి చేస్తున్న ఐటీకోర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రాజాతిరు మలేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐ సురేష్‌, ఐటీ కోర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఐ యాదగిరి, కానిస్టేబుల్‌ రాజాతిరుమ లేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:54 PM