Share News

మహాలక్ష్మి పథకంతో ఆర్థిక స్వావలంబన

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:14 AM

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలుచేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడు తుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

మహాలక్ష్మి పథకంతో ఆర్థిక స్వావలంబన

సిరిసిల్ల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలుచేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడు తుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్లు దాటి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పలువురు మహిళలకు ఉచిత బస్‌ టికెట్‌ అందజేసి, శుభాకాం క్షలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటు న్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగించుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రా యాలు వెల్లడించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వం లోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దే శంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాల్లో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్‌ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవే ట్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లి స్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొ న్నారు. పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట ప్రభుత్వం ఇస్తుం దని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరిం చారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని, ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్‌ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్‌ లింకే జీ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. మహి ళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో గీత, జిల్లా సం క్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశ రావు, శ్రీనివాస్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:14 AM