Share News

ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాతో ఆర్థిక భరోసా

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:08 AM

ప్రభుత్వం అమ లు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాతో నిరుపేద వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కలుగుతుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాతో ఆర్థిక భరోసా

ఇల్లంతకుంట, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అమ లు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాతో నిరుపేద వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కలుగుతుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో శుక్రవారం దరఖాస్తులు స్వీకరించగా వెల్జీపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబీకులు ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పథకాన్ని తీసుకవచ్చి దేశంలో ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి కుటుం బానికి బీమా పథకం వర్తిస్తుందని అన్నారు. ఇతర ప్రాంతాలలో ఉన్న వారికి సమాచారం ఇచ్చి గ్రామాలకు రప్పించే బాధ్యత స్థానిక నాయకులు తీసుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామా ల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కాం గ్రెస్‌ ప్రభుత్వం నిరుపేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోంద న్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, వడ్డీలేని రుణాలు, రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు. 200యూ నిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్‌ అందజేస్తున్న ఘనత ప్రభుత్వా నికి దక్కుతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే, అభి వృద్ధిపై దృష్టిసారించామన్నారు. ఈసందర్భంగా పోస్టర్‌, కరప త్రాలను ఆవిష్కరించారు. సర్పంచ్‌ నాయిని నవీన్‌కుమార్‌, మండల ప్రత్యేకాధి కారి రామకృష్ణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, ఏఎమ్‌సీ చైర్‌పర్సన్‌ అంతగిరి సాహిత్యవిన య్‌కుమార్‌, వల్లంపట్ల సర్పంచ్‌ నేరెళ్ళ విజయ్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాచ కట్ల సురేష్‌, ఎంపీడీవో శశికళ, ఉపసర్పంచ్‌ కంకనాల శ్రావణినరేష్‌రెడ్డి, ప్యాక్స్‌ డైరెక్టర్‌ గుండ వెంకటేశం, పసుల వెంకటి, రాంప్రసాద్‌రెడ్డి, తీగల పుష్పలత సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:08 AM