Share News

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై పోరు

ABN , Publish Date - May 20 , 2026 | 12:15 AM

భారీ డిస్కౌంట్ల తో ఈ-ఫార్మసీ సంస్థలు మందుల విక్రయించడం వల్ల చిన్నచిన్న మెడికల్‌ షాపులు నష్టాల్లోకి వెళ్తు న్నాయి.

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై పోరు

సిరిసిల్ల, మే 19 (ఆంధ్రజ్యోతి) : భారీ డిస్కౌంట్ల తో ఈ-ఫార్మసీ సంస్థలు మందుల విక్రయించడం వల్ల చిన్నచిన్న మెడికల్‌ షాపులు నష్టాల్లోకి వెళ్తు న్నాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న విధానాలతో రిటైల్‌, డీలర్ల విక్రయాలపై ప్రభావం చూపుతున్న సమస్యలను పరిష్కరించాల ని అఖిలభారత కెమిస్టు, డ్రగ్గిస్టుల సంఘం (ఏఐవో సీడీ) పిలుపుమేరకు మెడికల్‌ దుకాణాల యజమా నులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం దేశ వ్యాప్తంగా మెడికల్‌షాప్‌ల బంద్‌ పాటించనున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 550 మెడికల్‌ షా పులు మూతపడనున్నా యి. మెడికల్‌ దుకాణాల బంద్‌ వల్ల అత్యవసర మందుల కోసం ఇబ్బందు లు ఎదురయ్యే పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకొని నర్సింగ్‌ హోంలకు అను బంధంగా ఉన్న మెడికల్‌ దుకాణాల్లో మందులు ఇచ్చే వీలును కల్పించారు. ఇందుకు సంబంధించిన బందు పోస్టర్లను తెలం గాణ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆవి ష్కరించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆన్‌లైన్‌ ఔషధాల విక్రయాలతో రిటైల్‌ మందుల షాపుల్లో విక్రయాలు తగ్గి మందుల దుకాణాలు కుదేలవుతు న్నాయి. అలాగే డీలర్ల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆన్లైన్‌ ద్వారా నిషేధిత పరిమితికి మించిన ఔషధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒకే ప్రిస్ర్కిప్షన్‌ను పలుమార్లు రిపీట్‌ చేస్తూ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే మందులను మోతాదుకు మించి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ- ఫార్మ సీ పేరిట 28 ఆగస్టు 2018లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 817ఎఫ్‌, 23 మార్చి 2020నజారీ చేసిన 220 ఈ నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరుతున్నారు.

మంచి కోసమే మా పోరాటం..

- కొత్తపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలతో ప్రజలకు, మెడికల్‌ దుకాణాల నిర్వా హకులకు నష్టమే వాటి ల్లుతుంది. ప్రభుత్వ విధా నాలపై తాము చేస్తున్న పోరాటం అందరి మంచి కోసమే. ఆన్‌లైన్‌లో మందులు కొనుగోళ్లతో నాసిరకమైన మందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. రిటైల్‌ విక్రయాలు తగ్గి స్థానికంగా ఉండే చిన్న చిన్న మెడికల్‌ షాపుల నిర్వాహకులకు భారంగా మారుతుంది. 20న నిర్వ హిస్తున్న మెడికల్‌ షాప్‌ల బందుకు ప్రజలు సహక రించాలని కోరుతున్నాం.

Updated Date - May 20 , 2026 | 12:15 AM