ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:37 PM
వినాయక నవరాత్రి, నిమజ్జన వేడుకలను కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీపీ గౌ్‌స్ ఆలం అన్నారు.
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి, నిమజ్జన వేడుకలను కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీపీ గౌ్‌స్ ఆలం అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. ప్రతీ గణేష్ మండపం వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, వలంటీర్లు 24 గంటలు మండపం వద్ద అందుబాటులో ఉండాలన్నారు. మండపాల వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల బోర్డులను ప్రదర్శించాలని పేర్కొన్నారు.
ఫ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో మాట్లాడారు. నేరం జరిగిన వెంటనే శాస్త్రీయ ఆధారాలతో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు విచారణలో ఉన్న కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదనపు డీసీపీ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కృష్ణమూర్తి, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.