జిల్లాలో గణనాథుల సందడి
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:45 AM
ఓం గణపతియే నమః.. ఓం మంగళపతియే నమః.. అంటూ ఆది దేవుడు గణేషుడు పూజ లందుకున్నాడు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఓం గణపతియే నమః.. ఓం మంగళపతియే నమః.. అంటూ ఆది దేవుడు గణేషుడు పూజ లందుకున్నాడు. సోమవారం అల్పపీడన ప్రభా వంతో ఒక వైపు వర్షం కురుస్తుంటే మరోవైపు వినాయక చవితి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మ ధ్యాహ్నం వరకు వర్షం వినాయక చవితి ఉత్స వాల నిర్వాహకులకు, ప్రజలకు కొంత ఇబ్బంది కలిగించింది. వర్షం కురిసినప్పటికీ వినాయక చవితి ఘనంగా జరుపుకోవడానికి కావలసిన వస్తువులు కొనుగోలు, ఇళ్లలో ప్రతిష్టించుకోవడా నికి వినాయకులను వర్షంలోనూ తీసుకవెళ్లారు. శోభాయమానంగా వినాయకున్ని అలంకరించుకొ ని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నవరాత్రుల్లో నిత్యం గణపయ్యను కొలుచుకోవడానికి జిల్లా కేంద్రంతో పాటు ఊరూరా, వాడవాడలా అంద మైన మండపాలు ఏర్పాటు చేసి భారీ విగ్రహాల ను ప్రతిష్టించారు. పత్రి, పూలు, పండ్ల, వినాయ క ప్రతిమల కొనుగోళ్లతో సిరిసిల్ల మార్కెట్‌లో రద్దీ కనిపించింది.
సిరిసిల్లలో భారీ మట్టి వినాయకుడు
కాగా, ప్రకృతి పర్యావరణ సమతుల్యాన్నికి అద్దం పట్టే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా రామ్‌బా గీచ వద్ద యువకులు 30అడుగుల మట్టి విగ్రహా న్ని ప్రతిష్టించారు. భారీ మట్టి విగ్రహం ప్రజల ను ఆకర్షిస్తోంది. కలకత్తా నుంచి వచ్చిన కళాకా రులు 20రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని త యారుచేశారు.భారీ విగ్రహాన్ని మండపం వద్దనే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.
కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో పూజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాల్లో వినాయక చవితి సందర్భంగా భారీ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంప తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీ వో శ్రీధర్‌బాబు, ఏవో రాంరెడ్డి, రామచందర్, శ్రీకాంత్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీవై ఎస్‌వో రాందాస్, అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించి ఎస్పీ మహేష్ బిగితే, ఇతర పోలీసు అధికారులు పూజలు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, సీఐ మధుకర్ ఆర్‌ఎస్‌ఐలు రాజు, శ్రావ ణ్, సాయికిరణ్ జువైద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.