అందుబాటులో రైతులకు అవసరమైన ఎరువులు..
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:52 AM
జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటు లో ఉన్నాయని, కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటు లో ఉన్నాయని, కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలో ఎరువు ల సరఫరా నిర్వహణ తదితర అంశాలపై జిల్లా వ్యవసాయ, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల నిల్వలపై అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగుకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. పంటల సాగుకనుగుణంగా అన్ని ఎరువులు ఇక్కడే నిల్వచేయాలని ఆదే శించారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయాలు చేయాలని సూచించారు. వ్యవసా య శాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని ఎరువు ల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, డీఅర్‌డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్క్‌ఫెడ్ డీఎం హబీబ్ తదితరులు పాల్గొన్నారు.