Share News

అందుబాటులో ఎరువుల నిల్వలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:46 AM

రైతులకు అవసరమైన ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం సంబంధిత అధికారులను, ఎరువుల విక్రయదారు లను ఆదేశించారు.

అందుబాటులో ఎరువుల నిల్వలు

బోయినపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రైతులకు అవసరమైన ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం సంబంధిత అధికారులను, ఎరువుల విక్రయదారు లను ఆదేశించారు. గురువారం బోయినపల్లి మండలంలోని వెంకట్రావు పల్లి, విలాసాగర్‌, నర్సింగాపూర్‌ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘా లను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేడీసీఎంఎస్‌ వెంకట్రావుపల్లి, విలాసాగర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, నర్సింగాపూర్‌ లోని జీవనాధార రైతు ఉత్పత్తిదారుల సంఘం, బోయినపల్లిలోని మల్లన్న సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ దుకాణాల్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులకు కొరత లేకుండా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం విలాసాగర్‌ గ్రామంలో వలంటీర్ల ద్వారా చేపడుతున్న డిజిటల్‌ క్రాప్‌ సర్వేను పరిశీలించారు. ఈ నెలాఖరు లోగా ప్రతి రైతుకు సంబంధించిన పంటల నమోదును పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధి కారి ప్రణీత, ఏఈవోలు రవళి, హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:46 AM