Share News

విద్యార్థినులు క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:16 AM

విద్యార్థినులు సత్ప్రవర్తన, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని డీఎస్పీ భూక్యా రాంరెడ్డి సూచిం చారు.

విద్యార్థినులు క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించాలి
మాట్లాడుతున్న డీసీపీ భూక్యా రాంరెడ్డి

ఫ్రెషర్స్‌ వేడుకల్లో డీసీపీ భూక్యా రాంరెడ్డి

కోల్‌సిటీటౌన్‌, అక్టోబర్‌ 31(ఆంధ్రజ్యోతి): విద్యార్థినులు సత్ప్రవర్తన, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని డీఎస్పీ భూక్యా రాంరెడ్డి సూచిం చారు. శనివారం గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో మాట్లాడారు. విద్యార్థినులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగి కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీపీ మడత రమేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదం డ్రులను గౌరవించాలని, సోషల్‌ మీడియా వినియోగాన్ని తగ్గించి సమయాన్ని చదువు కు కేటాయించాలని సూచించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి దాసరి కల్పన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేన రెడ్డి, ఇన్‌ చార్జి ప్రిన్సిపాల్‌ రమేష్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే

అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ చింతల మోహన్‌, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. వరల్డ్‌ టూరిజం డే సంద ర్బంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. క్రికెట్‌ పోటీలలో పాల్గొని గెలుపొందిన టీమ్‌కు బహుమతులు అందజేశారు. సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇచ్చారు. ఆటపాటలు, నృత్యాలు, ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఫ్రెషర్స్‌ పార్టీ ఆనందోత్సాహాలతో ముగిసింది.

Updated Date - Nov 01 , 2026 | 12:16 AM