Share News

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:57 PM

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్‌ బి రాజ్‌ డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

సుభాష్‌నగర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్‌ బి రాజ్‌ డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూఏబీవీపీ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఏకంచేసి ముఖ్యమంత్రి రాజీనామా చేసేంతవరకు ఏబీవీపీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. కార్యకర్గంలో రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ మెంబర్లు మల్యాల రాకేష్‌, అజయ్‌, జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్‌, రాష్ట్ర హాస్టల్‌ కన్వీనర్‌ బామండ్ల నందు, కార్యకర్తలు అజయ్‌, శివ, విగ్నేష్‌, ఆకాష్‌, యశ్వంత్‌, నిత్య, బన్నీ, రాజేందర్‌, సూర్య, వంశీ పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:57 PM