Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:01 AM

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాతబస్టాండ్‌ వద్ద బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలీష్‌ చేస్తూ నిరసన చేపట్టారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

సిరిసిల్ల టౌన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాతబస్టాండ్‌ వద్ద బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలీష్‌ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను మొత్తం చెల్లిస్తామని హామీని చ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఆగ్రహం వ్యక్త చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మీద ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఆర్థిక భారంతో కొందరు విద్యకు దూరం కాగా మరికొందరు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ విద్యను అభ్యసిస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అం ధకారం అవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగా టం అడుకోకుండా తక్షణమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలను మొత్తం విడదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చె శ్రీనివాస్‌, సదుల శేఖర్‌, బల్యాల ప్రవీన్‌, బక్కని వేణుయాదవ్‌, దడికే రాజు, రాజేష్‌, ఆదిల్‌, యశ్వంత్‌, ఆమన్‌, వంశీ, లోకేష్‌, జుమీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:01 AM