Share News

హరీష్‌రావు, కేటీఆర్‌ కళ్లలో భయం కనబడుతోంది

ABN , Publish Date - Jan 25 , 2026 | 01:07 AM

సిట్‌ విచారణకు వెళ్లి బయటకు వచ్చిన హరీష్‌రావు, కేటీఆర్‌ కళ్లలో భయం కనిపిస్తోందని వేములవాడ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు.

హరీష్‌రావు, కేటీఆర్‌ కళ్లలో భయం కనబడుతోంది

వేములవాడ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సిట్‌ విచారణకు వెళ్లి బయటకు వచ్చిన హరీష్‌రావు, కేటీఆర్‌ కళ్లలో భయం కనిపిస్తోందని వేములవాడ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. వేములవాడ పట్టణంలో చొప్ప దండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరి గిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తే కేటీఆర్‌ మాత్రం ఇంకా నాటకం ఆడుతున్నారని విమర్శించారు. సినీతారల, జడ్జిల, వ్యాపారుల, నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి అవినీతి అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు. ఆనాడు పీసీసీ హోదా లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. మీకే కుటుంబాలు ఉన్నాయా.. మాకు కుటుంబాలు లేవా.. అని నిలదీశారు. డ్రోన్‌కు సంబంధించిన విషయంలో 14 రోజులు ఉగ్రవా దులు ఉండే బ్యారక్‌లో వేసి మానసిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాపింగ్‌ జరగలేదనేది నిజమైతే మీ స్వంత చెల్లి కవిత తన భర్త ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారని ఎందుకు చెబుతోందని, దానికి ముందు సమాధానం చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చేయాలనుకుంటే రెండు నెలల్లో జైలుకు పంపించే వారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తాము ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. ప్రభాకర్‌రావును అడ్డుపెట్టుకుని ఆడిన నాటకాలు బయటకు వస్తున్నాయని, చట్టంలో ఉండే శిక్షకి మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆరోపించారు. తెలంగాణ సమాజం మీ నాటకాలు గమని స్తోందని, రూ.75వేల కోట్ల అప్పుల నుంచి రూ.8లక్షల కోట్ల అప్పు చేశారని విమ ర్శించారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కి మారినప్పుడే తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయిందని అన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 01:07 AM