రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పవనాలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:52 AM
రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 30 (ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలోని టౌన హాల్ ఆవరణలో నిర్వహించిన బీజేపీ విజయశంఖారావం సంకల్ప సభకు నిజామా బాద్ ఎంపీ కలిసి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆయనకు, ఎంపీ ఆర్వింద్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పట్టణానికి చెందిన కొండ లక్ష్మణ్ అరుణ, మాజీ ఉద్యోగి పుప్పాల సత్యనారాయణ తో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ అర్విం ద్ సమక్షంలో పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రామచందర్‌రావు మాట్లాడుతూ మున్సిపల్ ప్రచారానికి తోలి వేదిక జగిత్యాల గడ్డ అవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోయే నావంగా మారిందని, అందులో చేరేవారు కూడా పార్టీతో సహా రాజకీయంగా మునిగిపోవడం ఖాయమని విమర్శించారు. తెలంగాణను, ప్రజలను దగా చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, దోచుకోవడంలో కూడా బీఆర్‌ఎస్‌నే కాంగ్రెస్ ప్రభుత్వం అవలం భిస్తూ అడుగులు వేస్తుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అవినీతి రహిత పాలనకు బీజేపికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డికి చీము, నెత్తురు లేదని, ఎన్నిసార్లు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయనకు చలనం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే ఏపార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదన్నారు. జగిత్యాల ని యోజకవర్గానికి కేంద్రం నిధులే వస్తున్నాయని, వాటి ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు నోటీసుల పేరుతో పైసలు వసూలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీలు క్లీనగా మారాలంటే బీజేపీకి ఓటు వేయాలని అర్వింద్ ్లప్రజలను కోరారు. కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్‌నేత, జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, మాజీ అధ్యక్షుడు సత్యనారా యణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి, కన్నం అంజయ్య, కొండా లక్ష్మణ్ అరుణ, నలువాల తిరుపతి, పిల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.