Share News

మరింత వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు..

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:38 AM

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయడానికి మరింతగా వేగం పెంచాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ అదేశించారు.

మరింత వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు..

సిరిసిల్ల అర్బన్‌, మే 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయడానికి మరింతగా వేగం పెంచాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ అదేశించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ శివారులోని అపెరల్‌ పార్క్‌లో పౌరసరఫరాల, గ్రామీణాభివృద్ధి, సహకార, మెప్మ, రవాణా, కార్మిక శాఖల అధికారులు, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌లతో కలిసి కలెక్టర్‌ పర్యటించి గోదాంలలో నిల్వచేసిన ధాన్యం పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అపెరల్‌ పార్క్‌లో ధాన్యం అన్‌లోడింగ్‌ను క్షేత్రస్థాయిలో చేపట్టడానికి హమాలీల సంఖ్యను పెంచాలన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్యలతోపాటు గోనె సంచులు ఇప్పటివర కు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేశారని అడిగితెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన గోనె సంచులు ముందస్తుగా తెప్పించాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని తెలిపారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్‌ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు, తరలింపు, అన్‌లోడింగ్‌ ప్రక్రియ వేగవంతంగా చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సహకార శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌ కుమార్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, కార్మిక శాఖ అధి కారి నజీర్‌ అహ్మద్‌, తహసీల్దార్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:38 AM