Share News

సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:27 AM

రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపుని చ్చారు.

సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి

కోనరావుపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపుని చ్చారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం ధర్మారంలో సేంద్రియ వ్యవసా య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో సేంద్రియ ఎరువు, అలాగే తయారీ విధానం, పశువుల పెంపకం ఇతర అంశా లను కలెక్టర్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రీయ పద్ధతిలో వ్యవ సాయం చేసేందుకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలి పారు. జిల్లాకు 9 బయో ఇన్‌ఫుట్‌ రిసోర్స్‌ సెంటర్‌ (బీఆర్సీ) సేంద్రి య వ్యవసాయ ఉత్పత్తులు తయారీ కేంద్రాలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రానికి లక్ష రూపాయలు అందజేసిందని తెలి పారు. ఆయా కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు, కషాయాలు, ఆవుపేడ ఇతర పదార్థాలతో సిద్ధం చేసిన వాటిని రైతులు సాగులో వినియోగిం చుకునేందుకు తోడ్పాటు అందించేందుకు ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. రైతులు తమ పరిధిలోని సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి తయారీకేంద్రాలు సందర్శించి సాగులో ఆయా ఉత్ప త్తులను వినియోగించాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ ఆర్థికంగా భరోసా ఇస్తుందని తెలిపారు. దీంతో నేలకు, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మిర్యాల్‌ కార్‌ బాలాజీ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, తహసీల్దార్‌ వర లక్ష్మి, ఎంపీడీవో నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:27 AM