Share News

నల్ల రేగళ్లలో ‘తెల’్లబోతున్న సాగు..

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:42 AM

నల్ల రేగళ్లలో తెల్ల పూలు పూయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు..

నల్ల రేగళ్లలో ‘తెల’్లబోతున్న సాగు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నల్ల రేగళ్లలో తెల్ల పూలు పూయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతంతో పత్తి సాగు చేసిన రైతులు మొలకెత్తని విత్తనాన్ని చూస్తూ తెల్లబోతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా వరితో పాటు పత్తి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్న రైతులు ఈసారి కూడా ఎల్‌నినో ప్రభావం ఉంటుందని హెచ్చరించినా ముందస్తుగానే విత్తనాలు వేసుకున్న దృష్ట్యా వర్షాలు లేక ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే మరోసారి విత్తనాలు వేసుకోవలసిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. మరోవైపు నకిలీ విత్తనాల భయం కూడా రైతులను వెంటాడుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ల్లో జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు పనులు మొదలు పెట్టగా, ఇప్పటివరకు 23,551ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. వరి సాగు 1.91లక్షల ఎకరాలకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకుని నాట్లకు ఎదురుచూస్తున్నారు. మరోవైపు 47,120 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి సిద్ధమైన రైతులు తొలకరి జల్లులతోనే విత్తనాలు వేసుకున్నారు. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో పత్తి సాగుకు అనుకూలంగా రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్పటి వరకు 23,250 ఎకరాల్లో పత్తి విత్తనాలు

జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. 174 క్లస్టర్లలో 47,120 ఎకరాల్లో పత్తి సాగుకు సిద్ధమైన రైతులు ఇప్పటివరకు 23,250 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. తేలికపాటి వర్షాలకు విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెడుతున్నారు. ఆలస్యంగా పత్తి విత్తనాలు వేసుకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళనతో రైతుల ఉన్నారు. జిల్లాలో ప్రతి ఏటా పత్తి సాగు వైపే ఆసక్తి చూపే రైతులు ప్రస్తుతం ఖరీఫ్‌లో దుక్కులు దున్ని వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్‌లో భారీ వర్షాలు కురవకపోవడంతో భూమిలో వేడి తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విత్తనాలు విత్తుకోవడం అనుకూలమైన పరిస్థితి కాదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పిస్తున్నారు. పంట మార్పిడి. ఆరుతడి పంటలను సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు.

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 2.48 లక్షల ఎకరాలు

వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో గంభీరావుపేటలో 19871ఎకరాలు, ఇల్లంతకుంటలో 3828ఎకరాలు, ముస్తాబాద్‌లో 26879 ఎకరాలు, సిరిసిల్లలో 5447 ఎకరాలు, తంగళ్ళపల్లిలో 24,052 ఎకరాలు, వీర్నపల్లిలో 8296 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో21914 ఎకరాలు, బోయిన్‌పల్లిలో 21260ఎకరాలు, చందుర్తిలో 21512 ఎకరాలు, కోనరావుపేటలో24187 ఎకరాలు, రుద్రంగిలో 10287ఎకరాలు, వేములవాడలో 10942 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 15622 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి లక్షా 91 వేల366 ఎకరాలు, పత్తి 47120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3430 ఎకరాలు, ఇతర పంటలు 5593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 123790 ప్యాకేట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా ఎరువులు 57399 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఖరీఫ్‌ సాగులో 57399 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులను వినియోగిస్తారు.యూరియా 25944మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3760 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22710మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4225 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ760 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకు సిరిసిల్లలో 100 ఎకరాలు, తంగళ్ళపల్లిలో 214 ఎకరాలు, ఇల్లంతకుంటలో 2260 ఎకరాలు, గంభీరావుపేటలో 55 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1080 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 320 ఎకరాలు, వీర్నపల్లిలో 55 ఎకరాలు, వేములవాడలో 756 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4520 ఎకరాలు, చందుర్తిలో 5020 ఎకరాలు, రుద్రంగిలో 981 ఎకరాలు, బోయిన్‌పల్లిలో4165 ఎకరాలు, కొనరావుుపేటలో 4025 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి సాగు కోసం 3103 ఎకరాల్లో నారుమడి సిద్ధం చేసుకున్నారు, పత్తి 2350 ఎకరాలు, పెసర 10 ఎకరాలు, కంది 117 ఎకరాలు, మొక్కజొన్న 174 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. లోటు వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి.

జిల్లాలో పత్తి సాగు

మండలం పత్తి విత్తుకున్న ఎకరాలు

గంభీరావుపేట 150 50

ఇల్లంతకుంట 12800 2260

ముస్తాబాద్‌ 650 1070

సిరిసిల్ల 750 100

తంగళ్లపల్లి 1300 200

వీర్నపల్లి 200 50

ఎల్లారెడ్డిపేట 3300 300

బోయినపల్లి 7000 4000

చందుర్తి 5500 5000

కోనరావుపేట 4400 4000

రుద్రంగి 1820 970

వేములవాడ 5050 750

వేములవాడ రూరల్‌ 4200 4500

-------------------------------------------------------------------------------------------------

మొత్తం 47120 2350

-------------------------------------------------------------------------------------------------

Updated Date - Jul 03 , 2026 | 12:42 AM