రహదారి నిర్మించాలని రైతుల రాస్తారోకో
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:47 AM
పట్టణంలోని వెల్లుల్ల రోడ్డు వద్ద గల ఎస్సారెస్పీ డి-32 కాల్వ ప్రాంతంలో రోడ్డును అభివృద్ధి చేయాలని సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.
మెట్‌పల్లి టౌన్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వెల్లుల్ల రోడ్డు వద్ద గల ఎస్సారెస్పీ డి-32 కాల్వ ప్రాంతంలో రోడ్డును అభివృద్ధి చేయాలని సోమవారం పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కాల్వవెంట ఉన్న పురాతన రోడ్డును వెంటనే సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయా లన్నారు. ఆ వైపు ఉన్న రైతులకు సరైన దారి కల్పించడంతో పాటు మల్లెతోట వరకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. తమ సమస్యలను కలెక్టర్, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్లకు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రహదారి సరిగా లేకపోవడంతో పంటల రవాణా, వ్యవసాయ పను లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని వారు ఆవేదన చెందారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని లేనియెడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. మెట్ పల్లి ఎస్‌ఐ కిరణ్ రైతులను సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు.