తూకాల్లో కోతలతో రైతులకు తీవ్ర నష్టం
ABN , Publish Date - May 29 , 2026 | 12:23 AM
తూకాల్లో కోతలు విధిస్తుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు విమర్శించారు.
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు
కథలాపూర్, మే 28 (ఆంధ్రజ్యోతి) : తూకాల్లో కోతలు విధిస్తుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు విమర్శించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లారీలు, హమాలీల కొరత పేరిట కొనుగోళ్లలో విపరీత జాప్యం చేస్తున్నారని దీంతో వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎలాంటి కోతలు లేకుండా నిబఽంధనల ప్రకారం కొనుగోళ్లు జరపాలని కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సిరికొండ, చింతకుంట, దుంపెట, బొమ్మెన, తాండ్ర్యాల, తుర్తి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు రాచమడుగు వెంకటేశ్వర్‌రావు, పిడుగు ప్రతాప్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేశ్, మండల ప్రధాన కార్యదర్శి నరెడ్డ రవి, గాంధారి శ్రీనివాస్, బద్రి సత్యం తదితరులు ఉన్నారు.