Share News

రైతులు భూసారాన్ని పరిరక్షించాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:33 AM

భూసారాన్ని పరిరక్షించేందుకు రైతులు గడ్డి మందుల వినియోగం తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ రైతులకు సూచించారు.

రైతులు భూసారాన్ని పరిరక్షించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి

-జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌

మల్యాల, జనవరి7(ఆంధ్రజ్యోతి): భూసారాన్ని పరిరక్షించేందుకు రైతులు గడ్డి మందుల వినియోగం తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ రైతులకు సూచించారు. మండలంలోని ముత్యంపేటలో డాక్టర్‌ మర్రి మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్యారాకట్‌ గడ్డి మందు వినియోగంపై రైతులకు ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడ్డి మందుల స్థానంలో ప్రత్యామ్నయ పద్దతులు అవలంభించాలని అన్నారు. ప్యారాకట్‌ గడ్డి మందుల వాడకంతో రైతుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని, అలాగే భూసారం తగ్గడం, నేల సూక్ష్మజీవుల నాశనం, నీటి కాలుష్యం ంటి పర్యవరణ సమస్యలు తలెత్తుతాయని వివరించారు. సురక్షిత గడ్డి మందులు, యాంత్రిక కలుపు నియంత్రణ, సేంద్రియ పద్దతుల గురించి సూచనలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో గడ్డి వినియోగం తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్‌, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్‌, ఏవో చంద్రదీపక్‌, సర్పంచ్‌ దారం ఆదిరెడ్డి, ఉపసర్పంచ్‌ కందరి ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి, నల్ల నరసింహరెడ్డి, మ్యాక లక్ష్మన్‌, మహిపాల్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ఉచిత వైద్య శిభిరం నిర్వహించి వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు.

Updated Date - Jan 08 , 2026 | 12:33 AM