రైతులు దళారులను ఆశ్రయించవద్దు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:56 AM
రైతులు పండించిన ప్రతి వరి ధాన్య పు గింజలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతు లు తొందరపడి దళారులకు విక్రయించొద్దని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన ప్రతి వరి ధాన్య పు గింజలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతు లు తొందరపడి దళారులకు విక్రయించొద్దని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి తడ గొండ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు సెం టర్‌ను బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభు త్వం అధిక నిధులను ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమం లో డసీఎంఎస్ మాజీ చైర్మన్ ముందుగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, తహసీల్దార్ ఎండీ షరీఫ్ మొహినోద్దీన్, ఎంపీడీవో జయ శీల, ఏవో ప్రణీత, నాయకులు కుస రవీందర్, వన్నెల రమణారెడ్డి రెడ్డి, సువిన్ యాదవ్, సర్పంచ్‌లు బింరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఏనుగుల కనకయ్య, నల్ల మోహన్ సుద్దా ల మధు, తదితరులు పాల్గొన్నారు.