సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:01 AM
సీసీఐ కొనుగోలు కేంద్రాల ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
కోనరావుపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీసీఐ కొనుగోలు కేంద్రాల ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల కావేరి పత్తి మిల్లులో గురువా రం సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పం డించిన పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 8,600 రూపాయల కు 8శాతం తేమతో విక్రయించారని అన్నారు. దేశంలో ఎల్‌నినో ప్రభావం తో నీటి ఎద్దడి ఏర్పడుతుందని ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. అధికారుల సూచనలు పాటించాలని కోరారు. వ్యవసాయంలో నీటి వినియోగం తక్కువగా ఉండే అరుతడి పం టల సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఆత్మ కమిటీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయ ణగౌడ్, తహసీల్దార్ వరలక్ష్మి, ప్యాక్స్ చైర్మన్లు చేపూరి గంగాధర్, బొమ్మెన భాస్కర్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ప్రకాష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంతోష్, నాయకులు బండ నర్సయ్య, మార్కెట్ కమిటీ, ఫ్యాక్స్ డైరెక్టర్‌లు, రెడ్డి, సంజీవ్, నాయి ని ప్రభాకర్ రెడ్డి, బాదినేని బాలరాజు, ఉప్పుల గంగయ్య పాల్గొన్నారు.