రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:05 AM
రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ చత్రునాయక్ అన్నారు. హుజూరాబాద్ కేసీ క్యాంపులోని రైతు వేదికలో విత్తన మేళాను మంగళవారం ప్రారంభించారు.
హుజూరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ చత్రునాయక్ అన్నారు. హుజూరాబాద్ కేసీ క్యాంపులోని రైతు వేదికలో విత్తన మేళాను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23నుంచి 30వరకు జరిగే విత్తన మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఎరువుల దుకాణాల నుంచి రసీదులు తీసుకోవాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయాలన్నారు. ఎరువులు అధిక మొత్తంలో వాడడం వల్ల నేల దెబ్బతినడంతో పాటు ప్రజల అనారోగ్య పాలవుతారన్నారు. రైతులు వరితో పాటు పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయాలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సునీత, ఏవో భూమిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గూడూరి రాజేశ్వరి, ఏఈవో నిఖిల్ పాల్గొన్నారు.