Share News

రైతులు సన్నరకం ధాన్యం పండించాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:41 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రోహిస్తున్న తరుణంలో రైతులు సన్నరకం ధాన్యాన్ని పండించాలని, అలాగే కొనుగోలు కేంద్రాలల్లోనే ధాన్యంను విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరలను పొందాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

రైతులు సన్నరకం ధాన్యం పండించాలి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రోహిస్తున్న తరుణంలో రైతులు సన్నరకం ధాన్యాన్ని పండించాలని, అలాగే కొనుగోలు కేంద్రాలల్లోనే ధాన్యంను విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరలను పొందాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తనిఖీలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యంను పరిశీ లించడంతో పాటు తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను కలెక్టర్‌ పర్యవేక్షించారు. ఎంత ధాన్యం వస్తుంది.. ఎన్ని గన్నీ బ్యాగులు ఉన్నాయని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రా లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజన్‌ నర్సింహ, తహసీల్దార్‌ విజయ్‌ప్ర కాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:41 AM