భూసేకరణకు రైతులు సహకరించాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:48 AM
కాళేశ్వరం లింక్-2 కాలువ నిర్మాణంలో భాగంగా అవసరమైన భూసేకరణకు రైతులు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మదుసూదన్ పేర్కొన్నారు.
-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
పెగడపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం లింక్-2 కాలువ నిర్మాణంలో భాగంగా అవసరమైన భూసేకరణకు రైతులు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మదుసూదన్ పేర్కొన్నారు. మంగళవారం పెగడపల్లి మండలంలోని నందగిరి, దీకొండ, ల్యాగలమర్రి గ్రామాలలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు రిజర్వాయర్‌లోకి తక్షణ నీటి నిల్వలు లాగడం కోసం అవసరమున్న భూసేకరణకు గ్రామ సభలు నిర్వహించారు.
నందగిరిలో 8 మంది రైతుల నుంచి 1,08 ఎకరాలు, దీకొండలో 48 మంది రైతుల నుంచి 16.18 ఎకరాలు, ల్యాగలమర్రిలో 125 మంది రైతుల నుంచి 41.2450 ఎకరాలు భూమి సేకరించనున్నట్లు తెలిపారు. గ్రామసభల్లో ఆయా గ్రామాల సర్పంచులు దనియాల రజిత సురేష్, నామ సురెందర్ రావు, ఎలకటూరి రవిల అధ్యక్షతన జరుగగా ఆర్డీవో మధుసూదన్‌తో పాటు డీఈ నర్సింగరావు, తహసీల్దార్ జి.ఆనంద్ కుమార్, గిర్దావర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.