రైతులకు సరైన వసతులు కల్పించాలి
ABN , Publish Date - May 07 , 2026 | 12:35 AM
కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు సరైన వసతులు కల్పించాలని కలెక్టర్ గరి మ అగ్రవాల్ నిర్వాహకులకు సూచించారు.
వేములవాడ రూరల్, బోయినపల్లి మే 6(ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు సరైన వసతులు కల్పించాలని కలెక్టర్ గరి మ అగ్రవాల్ నిర్వాహకులకు సూచించారు. బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలోని రైస్‌మిల్లు, కొదురుపాకలోని కొనుగోలు కేంద్రాన్ని, వేములవాడ అర్బన్ మండల పరిధిలోని అనుపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధావారం ఆమె పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు సమకూర్చాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే అవకా శం ఉన్నందున ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని, కొనుగోలు చేసిన ధాన్యంలో ఎంతమేర రైస్‌మిల్లులకు తరలించారో వివరాలను తెలుసుకున్నారు. రైస్ మిల్లులో హమాలీల సంఖ్య పెంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీలను వేగంగా అన్‌లోడ్ చేయాలన్నారు. ధాన్యం కొను గోలుకు సంబంధించి ఆన్‌లైన్ ఎంట్రీని పూర్తి చేయాలన్నారు. కొను గోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బు వేగవం తంగా జమ అయ్యేలా చూడాలన్నారు. జిల్లా పూరసరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధి కారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, పలువు రు సిబ్బంది పాల్గొన్నారు.