Share News

ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:15 AM

లోటు వర్షపాతం నమోదవు తున్నందున, ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్స హించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులు ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలి

సిరిసిల్ల, జూలై 9 (ఆంరఽధజ్యోతి) : లోటు వర్షపాతం నమోదవు తున్నందున, ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్స హించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులు ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, వానాకాలం సాగు, తదుపరి కార్యాచరణ అంశాలపై గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యం నుంచి జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరయ్యారు. లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కూడా కనిపిస్తున్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలన్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులకు సూచనలు అందించాలన్నారు. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్‌పామ్‌ లాంటి పంటల సాగు ఆవశ్యకత తెలియజేయాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవన్నారు. యూరియా అమ్మకాల ప్రక్రియను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమీ క్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే సాగు చేయాలని, తద్వారా బోనస్‌ పొందవచ్చని తెలిపారు. ఈ రకాలను ప్రతి రైతుకు తెలియజేయాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు నీటి లభ్యత, విడుదల తదితర అంశాలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో రైతు శ్రేయస్సు కోసం పని చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి రైతుకు సాంకేతిక సలహాలు, వాతావరణ సూచన, పంటల ఎంపికపై మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. వీబీ జీ రామ్‌ జీ పథకం అమలుకు సరైన ప్రణాళిక రూపొందించి కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని తెలిపారు. వ్యవసాయ, విద్యుత్‌ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేయాలని, వర్షాలకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు అన్ని సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ప్రతి రిజర్వాయర్‌లో నీటి మట్టం పరిశీలిస్తూ ఎగువ రాష్ట్రాల నుంచి వరదను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాగునీటికి ఇబ్బం ది లేకుండా చూడాలని తెలిపారు. రిజర్వాయర్లలో నీటి మట్టం, వర్షాలపై ప్రతి వారం సమీక్ష చేస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పంటలు వైవిద్యం చేసేందుకు ఇదే మంచి అవకాశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే ఎల్‌నినో ప్రభావాన్ని కూడా అధిగమించ వచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయా లని సూచించారు. కూరగాయలు, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, ఆయిల్‌పామ్‌ సాగు వైపు మళ్లాలని పిలుపు నిచ్చారు.దీనికి సంబం ధించిన అన్ని విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశిం చారు. నీటి పారుదల శాఖ అధికారులు నీటి మట్టం వివరాలు వ్యవ సాయ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌ బాబు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, మార్క్‌ఫెడ్‌ అధికారి హబీబ్‌, నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:15 AM