ఐక్య పోరాటాల ద్వారానే రైతాంగ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:35 AM
ఐక్య పోరాటాల ద్వారానే రైతాంగ సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరుకాయల జంగారెడ్డి అన్నారు.
భగత్‌నగర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఐక్య పోరాటాల ద్వారానే రైతాంగ సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరుకాయల జంగారెడ్డి అన్నారు. నగరలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో రైతు సంఘం కరీంనగర్ జిల్లా మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నష్ట పరిచే విధనాలు కొనసాగిస్తోందన్నారు. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు ఐక్య సమరశీల పోరాటం నిర్వహిస్తే కేంద్రం దిగివచ్చి ఆ చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో లెల్లల బాలకృష్ణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వర్ణ వెంకటరెడ్డి, వెలమరెడ్డి రాజిరెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, బాసిర సంపత్‌రావు, గుండేటి వాసుదేవ్, జూనుతుల జనార్ధన్‌రెడ్డి, శీలం అశోక్, చేలుపూరి రాములు, నూనె శేఖర్ పాల్గొన్నారు.