భూసర్వేను అడ్డుకున్న రైతులు
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:30 AM
సిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాల నిర్మాణానికి నిర్వహిస్తున్న భూసర్వే ను గ్రామస్తులు అడ్డుకున్నారు.
వేములవాడ రూరల్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాల నిర్మాణానికి నిర్వహిస్తున్న భూసర్వే ను గ్రామస్తులు అడ్డుకున్నారు. మర్రిపల్లి గ్రామంలో రాజన్న ఆలయ గోశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసేందుకు రూరల్ ఎమ్మార్వో అబూబాకర్ సిబ్బందితో కలిసి శుక్రవారం భూసర్వే నిర్వహిస్తుండగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ రోజున రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పారదర్శకంగా చేయవల్సిన సర్వేను దొంగచాటుగా ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 748 సర్వే నంబర్‌లో రైతులకు ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవాలని చూడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇక్కడి భుముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం పొందుతున్నామని, ఇప్పు డు ప్రభుత్వం తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల్లో వేసిన పంటలను తహసీల్దార్ తొలగిస్తానన్నారని రైతులు వాపోయారు. ఎమ్మె ల్యే ప్రత్యేక చొరవ చూపి సర్వేను ఆపి తమకు న్యాయం జరిగేలా చూడా లని రైతులు కోరారు.