Share News

కరెంటు ‘కోత’లతో రైతన్నల విలవిల

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:42 AM

ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్తు సరఫరాలో కోత లు విధిస్తుండడంతో.. పొట్ట దశకు వచ్చిన వరి పంటల ను కాపాడుకునేందుకు అన్నదాతలు తంటాలు పడుతున్నారు.

కరెంటు ‘కోత’లతో రైతన్నల విలవిల

ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్తు సరఫరాలో కోత లు విధిస్తుండడంతో.. పొట్ట దశకు వచ్చిన వరి పంటల ను కాపాడుకునేందుకు అన్నదాతలు తంటాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట చేనులు పగుళ్లు చూపడంతో దిగులు చెందుతున్నారు. పంటలకు తడులు పెట్టేందుకు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వరతండా, గొల్లపల్లి గ్రామాల్లోని రైతులు అజ్మీ రా లింబ్యానాయక్‌, దేవయ్యలు సాగుచేసిన వరి పంట లు పొట్ట దశకు చేరుకున్నాయి. లింబ్యానాయక్‌ తనకు న్న ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలను కౌలుకు తీసు కుని రూ. 3లక్షలు పెట్టుబడులతో వరి పంటను సాగు చేశాడు. రెండు బోర్లద్వారా సాగు నీరందిస్తున్నాడు. కరెం టు కోతలు అధికవడంతో సాగు నీరందక నాలుగెకరాల్లో ని వరి పంట పగుళ్లు చూపింది. పొట్ట దశలోని పంటను దక్కించుకునేందుకు నిత్యం ఒక్కో ట్యాంకరుకు రూ.1500 చెల్లించి పొలానికి నీరందిస్తున్నానన్నాడు. రోజుకు 4 ట్రిప్పులద్వారా రూ.6వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోం దని వాపోతున్నాడు. రెండు, మూడు రోజలకోకసారి తడులను పెడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. గొల్లపల్లిలోని రైతు దేవయ్య తన నాలుగెకరాల్లో రూ.1.20 లక్షలు వెచ్చించి వరి పంటను సాగు చేయగా ప్రస్తుతం పొట్ట దశకు చేరుకుంది. ఉన్న ఒక్క బోరు ద్వారా పంట కు నీరందకుండా పోతోంది. విద్యుత్తు కోత వల్ల పంట ఎండిపోయే పరిస్థితి దాపురించడంతో ట్రాక్టర్‌ ఇంజన్‌కు డైనమోను బిగించి స్టార్టర్‌కు కరెంటు సరఫరాతో పంట కు తడులు పెడుతున్నానని రైతు దేవయ్య తెలిపాడు. రోజూ ట్రాక్టర్‌ డీజిల్‌కు రూ.3వేలు ఖర్చవుతోందని చెప్పా డు. మరో 25రోజులు నీటి తడులు అందిస్తే పంట చేతికి వస్తోందని రైతులు లింబ్యానాయక్‌, దేవయ్య తెలిపారు.

విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి..

కోనరావుపేట : వారం రోజులుగా విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో పంట పొలాల రైతులు ఇబ్బందులు పడు తున్నారు. అధికారులు పట్టించుకోకపోవ డంతో పంటలను కాపాడడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ పరిధి సత్య నారాయణపల్లె, ఎల్లమ్మ పల్లె ప్రాంతంలో అధిక ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. వారంరోజులు గడిచినా విద్యుత్‌ అధికారులు పట్టించుకో కపోవడంతో ట్రాక్టర్ల ద్వారా నీటిని తర లించి పూలతోటలు, పంటపొలాలను కా పాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నా రు. విద్యుత్‌ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగుచేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:42 AM