Share News

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

ABN , Publish Date - May 18 , 2026 | 12:54 AM

ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిర సన వ్యక్తం చేశారు.

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

కోనరావుపేట, మే 17 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిర సన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో లారీల కొరత వల్ల కొను గోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగడం లేద ని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లారీలను తెప్పించి ధాన్యాన్ని తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుండా వెంకటేష్‌, మాజీ సర్పంచ్‌ గోపు పరశురాములు, లింగారెడ్డి, మల్లారెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:54 AM