ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల రాస్తారోకో
ABN , Publish Date - May 15 , 2026 | 11:52 PM
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కోరుట్ల పట్టణంలో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. కోరుట్ల మార్కెట్ కమిటీలో 20 రోజుల క్రితం ధాన్యం తీసుకవచ్చినా తూకం వేయడంలో నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కోరుట్ల రూరల్, మే 15 (ఆంధ్రజ్యోతి : ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కోరుట్ల పట్టణంలో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. కోరుట్ల మార్కెట్ కమిటీలో 20 రోజుల క్రితం ధాన్యం తీసుకవచ్చినా తూకం వేయడంలో నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైస్ మిల్లర్లు అధికంగా తూకం వేసినా అధికారులు, కేంద్ర నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలు లేవని మిల్లుకు తరలించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. అందోళన చేస్తున్న రైతులను సముదాయించేందుకు ఆర్‌ఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. విషయాన్ని సింగిల్ విండో చైర్మన్ భీంరెడ్డితో చర్చించి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా రైతులు ఆందోళన కొనసాగించారు. మేడిపల్లి ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి సముదాయించి అందోళన విరమించే ప్రయత్నం చేసారు. ఈ సందర్బంగా సింగిల్ విండో చైర్మెన్ భీంరెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్ ఉన్నత అధికారులు దృష్టికి తీసుకపోయి కొనుగోలు వేగవంతం చేస్తామని హమీ ఇవ్వడంతో రైతులు అందోళన విరమించారు. రైతులు అందోళన చేస్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో రైతులు మానవీయ కోణంలో ఆలోంచించి వాహనానికి దారిని వదిలారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో జాప్యంపై రైతుల నిరసన
కథలాపూర్: కొనుగోలు కేంద్రాలకు ఽధాన్యం తరలించి నెల రోజులు గడుస్తు న్నా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం మండలంలోని భూషణరావుపే ట రైతులు నిరసన తెలిపారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాము నెల రోజుల కిందట ధాన్యం తేగా విపరీతంగా కాలయాపన చేయడం దారుణమని అన్నారు. లారీలు రావడం లేదనే కారణంతో తూకం వేయడం లేదన్నారు. తరచూ అకాల వర్షాలు కురుస్తుండడం వల్ల మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని లారీలు పంపించి ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం మహేందర్‌రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, లింగారెడ్డి తదితరులు ఉన్నారు.