రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:12 AM
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందు కు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించా రు.
సిరిసిల్ల, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందు కు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించా రు. మంగళవారం కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుపై ఏపీఎంలు, ఐకేపీ కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, బుక్ కీపర్లకు శిక్షణ ఇచ్చారు. ఈసంందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ 2389, కామన్ రకానికి క్వింటాలుకు రూ.2369 ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశార న్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేయనున్న 136 కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు వేయించాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. తూకం వేసే యంత్రాలు, తేమ శాతం చూపే యంత్రా లు, టార్ఫాలిన్లు, గన్నీబ్యాగులు సరిపడా సమ కూర్చుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశా లకు అనుగుణంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు, ఇతర వివరాలతో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఏఈవో ధ్రువీకరించిన తరువాత కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు రాకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమో దుచేయాలని తెలిపారు. అన్ని కొనుగోలు కేం ద్రాల నిర్వాహకుల వద్ద రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌ఫో ర్టు కాంట్రాక్టర్లు, అధికారుల ఫోన్‌నంబర్లు అం దుబాటులో ఉండాలని తెలిపారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డీవో గీత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ డీఎం నర్సింహరెడ్డి, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఏపీఎంలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.