Share News

బీఆర్‌ఎస్‌ హయాంలోనే రైతులకు మేలు..

ABN , Publish Date - May 06 , 2026 | 12:32 AM

రైతుల కష్టాలు తెలిసిన కేసీ ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే రైతులకు మేలు జరిగిందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే రైతులకు మేలు..

ఇల్లంతకుంట, మే 5(ఆంధ్రజ్యోతి): రైతుల కష్టాలు తెలిసిన కేసీ ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే రైతులకు మేలు జరిగిందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. మండలంలోని కేసన్నపల్లె, ముస్కానిపేట గ్రామాలలో మంగళవారం రైతులతో మాట్లాడారు. సాగునీటి కోసం ఇల్లంతకుంట మండల రైతులు ఇబ్బందులు పడేవారని అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి కాలువలద్వారా నీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగిందన్నారు. పెట్టుబడి సాయం సమయానికి అందక రైతులు అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంర దాలలో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - May 06 , 2026 | 12:32 AM