ధాన్యం కొనడం లేదని పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన
ABN , Publish Date - May 23 , 2026 | 12:47 AM
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కేంద్రానికి తీసుకువచ్చి నెలరోజులు గడుస్తున్నా.. ధాన్యం కొనడంలేదని విసుగు చెందిన రైతు గన్న రాజురెడ్డి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు.
ఎల్లారెడ్డిపేట, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కేంద్రానికి తీసుకువచ్చి నెలరోజులు గడుస్తున్నా.. ధాన్యం కొనడంలేదని విసుగు చెందిన రైతు గన్న రాజురెడ్డి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. బాధిత రైతు కథనం మేరకు.. గ్రామంలోని రైతు రాజురెడ్డి తనకున్న ఐదెకరాల విస్తీర్ణంలో సాగు చేసిన వరి పంటను కోసి నెల రోజుల కిందట స్థానిక ఐకేపీ కొనుగోలు కేం ద్రానికి ధాన్యం తరలించాడు. వరుస క్రమం లో తూకం వేయాల్సిన నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా కాంటాలు పెడుతున్నారని ఆరోపించాడు. తన ధాన్యం ఎందుకు తూకం వేయడం లేదని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధా నం చెబుతున్నారని వాపోయాడు. తన తర్వా త తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో విసుగుచెందిన రైతు రాజురెడ్డి వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాడు. ధాన్యం తూకం వేయకపో తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించా డు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ టన స్థలానికి చేరుకుని తూకం వేసేలా చూ స్తామని హామీ ఇవ్వడంతో శాంతించాడు.