Share News

అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి

ABN , Publish Date - May 27 , 2026 | 12:03 AM

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి

సిరిసిల్ల టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమా వేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. బీజేపీ వైఫల్యాలను ఎప్పకటికప్పుడు ప్రజల వద్దకు చేర్చాలన్నారు. పేదల కలలను సహకారం చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని అన్నారు. పన్నెండు సంవత్సరాలుగా దేశాన్ని నరేంద్రమోదీ పరిపాలిస్తున్నా పేదవారికి ఉపయోగపడే పథకాన్ని ఒక్కటి తీసుకురాలేదని ఆరోపించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా రైతు రుణమాఫీలు చేయలేదని విమర్శించారు. దక్షిణ భారత దేశంలోని తెలం గాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు తిరస్కరిం చారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ చక్కటి ఫలితాలను సాధించి రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అవుతారన్నారు. ధార్మిక, కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రణాళికాబద్ధంగా నేతన్నలకు చేతినిండా పని కల్పి స్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన కులగణన కూడా దేశా నికి రోల్‌మోడల్‌గా మారిందన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయబో తుందని, రేషన్‌ బియ్యం కార్డు ఉన్న వారికి ఆత్మీయ జీవిత భీమా భరోస పథకాన్ని జూన్‌ 2న తీసుకువస్తుందన్నారు. నూతన నాయకత్వానికి బాధ్యతలను అప్పగించి పార్టీని మరింత బలోపే తం చేసుకోవాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జీరోకి పరిమితం చేయగలిగామన్నారు. కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజవర్గం ఇన్‌చార్జి కూన శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే ఆవ శ్యకత ఉందని, అందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మున్నూరుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన బొమ్మ శ్రీరాంను జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, నాయకులు సన్మా నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ వేములవాడ నియోజకవవర్గ ఇన్‌చార్జి ఫక్రుద్దీన్‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు రాగుల జగన్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆడెపు చంద్రకళ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్స్‌, చైర్మన్లు, కౌన్సిలర్లు, ఆయా మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, అనుబంధ సం ఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 12:03 AM