Share News

మంత్రి పదవి కోసం అసత్య ఆరోపణలు సరికాదు..

ABN , Publish Date - May 25 , 2026 | 12:33 AM

మంత్రి పదవీకోసం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై అసత్యపు ఆరోపణలు చేయడం సరైంది కాదని, ముందుగా తన నియోజకవర్గం వేముల వాడ ప్రాంతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్‌ చేశారు.

మంత్రి పదవి కోసం అసత్య ఆరోపణలు సరికాదు..

సిరిసిల్ల అర్బన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి) : మంత్రి పదవీకోసం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై అసత్యపు ఆరోపణలు చేయడం సరైంది కాదని, ముందుగా తన నియోజకవర్గం వేముల వాడ ప్రాంతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని తెలంగాణ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాఽధించిన కేసీఆర్‌తో పాటు అభివృద్ధి అంటే ఏంటో చేసి నిరూపించిన కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అసత్యపు ఆరోపణలు చేయడం సరైం ది కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అంటేనే ప్రజలకు విరక్తి పుట్టింద న్నారు. మళ్లీ రాష్ట్రంలో కేసీ ఆర్‌ పాలన రావాలని ప్రజ లు కోరుకుంటున్నారనే విష యాన్ని గ్రహించాలని అన్నారు. అది శ్రీనివాస్‌ ఎన్ని కల సమయంలో వేములవాడ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే బీ ఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆ నియోజకవర్గంలో పర్యటిం చి ఆయన ఇచ్చిన హామీలను అమలుచేయాలంటూ ఆందోళనలు చేపడుతామన్నారు. ఇప్పటికైనా కేసీ ఆర్‌, కేటీఆర్‌లపై ఆరోపణలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్ర పాణి, గుడూరి ప్రవీణ్‌, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి, కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 12:33 AM