జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:40 AM
వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 14నుంచి 16 వరకు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 14నుంచి 16 వరకు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. మంగళవారం వేములవాడలో చేపట్టిన మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శ నం కల్పించేందుకు ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు. అనంత రం లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూలైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పా టు చేయనున్న క్యూలైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతో పాటు ఆల య పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. ఇదేవిధంగా ప్రోటోకాల్ కార్యాలయంలో రూ.1000 వేద ఆశీర్వచనం, రూ.500 స్పెషల్ కోడె, రూ.300 స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆల య డీఈలు రఘునందన్, మైపాల్‌రెడ్డి, ఏఈవోలు జయకుమారి, శ్రావణ్‌కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పం డితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.