రవాణా శాఖ అధికారుల విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:05 AM
జాతీయ రవాదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం డీటీసీ పురుషోత్తం ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు.
తిమ్మాపూర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ రవాదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం డీటీసీ పురుషోత్తం ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు. కరీం నగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్ రేకుర్తి వద్ద తనిఖీల్లో భాగంగా ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, టాక్స్ చెల్లించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్ మొత్తం 9 వాహనాలను పట్టుకొని వాటిపై జరిమానా విధించినట్లు తెలిపారు. ఆదే విధంగా గంగాధరలో పరిమితికి మించి లోడ్‌తో గ్రానైట్ రవాణా చేస్తున్న లారీని పట్టుకొని మోటర్ వాహనాల చట్ట నిబం ధనల ప్రకారం జరిమానా విధఙంచడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై నడిచే వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, బీమా చేయించకపోవడం, టాక్స్ చేయించకపోవడం చట్ట రీత్యా నేరమన్నారు. చట్టాలను ఉల్లంఘిం చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో ఎంవిఐ రవి కుమార్, ఏఎం విఐ హరిత ఇతర రవాణాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.