యువజన, క్రీడా వారోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - May 17 , 2026 | 12:35 AM
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 18 నుంచి మే 23వ తేదీవరకు నిర్వహించనున్న యువజన, క్రీడా వారోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశిం చారు.
సిరిసిల్ల, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 18 నుంచి మే 23వ తేదీవరకు నిర్వహించనున్న యువజన, క్రీడా వారోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశిం చారు. శనివారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడావారోత్సవాల నిర్వహణ, జిల్లాస్థాయి సభల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన- ప్రగ తి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వర కు ప్రతీ జిల్లాలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసు కోవాలని జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్రీడా పోటీలు, తదితర కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈనెల 22వ తేదీన నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణపై మార్గదర్శనం చేశారు. 2కే రన్, సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన ఉపాధి అవకాశాలకు సంబంధిం చిన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
23వ తేదీన జాబ్ మేళా
సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని కె కన్వెన్షన్ హాల్‌లో మే 23న ఉదయం 9గంటల నుంచి ఉద్యోగ సాధన పేరుతో జాబ్ మేళా నిర్వహించ నున్న ట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. 22వ తేదీ న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహిం చే సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో యువజన, క్రీడా వారోత్సవాల నిర్వహణ, అలాగే ఈనెల 22వ తేదీన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సభ విజయవంతం చేసేందుకు చేయాల్సి న ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, ప్రణాళిక ప్రకారం మే 18వ తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఉదయం 6.30 గంటలకు 2కే రన్ నిర్వహణ, మే 19వ తేదీన ఐడీఓసీ లో కెరీర్ నైపుణ్యాభివృద్ధి నిర్వహించి, ఉపాధిఅవకాశాలు, నైపుణ్యాభి వృద్ధి, కెరీర్ మార్గదర్శకత్వంపై యువతకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన సిరిసిల్లలోని మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 22వ తేదీన ఉదయం వేములవాడలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, హరిత హో టల్ సమీపంలోని పరిసరాలలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం చేపట్ట నున్నట్లు తెలిపారు. అనంతరం కరీంనగర్‌లోని మ్యూజియం సందర్శన ఉంటుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం సిరిసిల్ల కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమీ క్షలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, యువజన, క్రీడా శాఖ అధికారి రాందాస్ పాల్గొన్నారు.