తరుగు పేరిట దోపిడీని అరికట్టాలి
ABN , Publish Date - May 07 , 2026 | 12:37 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను దోపిడీ చేయడం అరికట్టడంతోపాటు పూర్తి స్థాయిలో ధాన్యం ను కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల అర్బన్, మే 6 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను దోపిడీ చేయడం అరికట్టడంతోపాటు పూర్తి స్థాయిలో ధాన్యం ను కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. ఈమేరకు ఈనెల 11న కలెక్టరేట్ ఎదుట రైతులతో ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో బుధవారం జరిగిన సీపీఎం జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యుడు సైల్కాబ్‌బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం యాప్‌ను ప్రకటించిందని దాని వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. తరుగు పేరిట రైతులను దోపిడీకి గురి చేయవద్ద న్నారు. రూ 2389 నుంచి రూ.1700 క్వింటాలు చొప్పున రైతాంగం దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితికి ప్రభుత్వం తీసుకవచ్చిందని ఆరోపించారు. తమది ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఐకేపీ కేంద్రాల్లో పర్యటించాలన్నారు. రైతుల కష్టాలు అర్థం కావాలంటే ఏసి గదిలో నుంచి ఐకేపీ కేంద్రాలకు రావాలని డిమాండ్ చేశారు. మే 11న సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల్ ధరలు విపరీతంగా పెంచి కృత్రిమ కొరత సృష్టిం చి తద్వారా హోటళ్లు, టీస్టాళ్లు ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు అవుతున్నాయ న్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పేదలపై భారం మోపిందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ కోడం రమణ, ఎగమంటి ఎల్లా రెడ్డి జవ్వాజి విమల, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, అన్నల్దాసు గణే ష్, సూరం పద్మ, గురిజాల శ్రీధర్, శ్రీరాముల రమేష్ చంద్ర పాల్గొన్నారు.