మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించాలి
ABN , Publish Date - May 27 , 2026 | 12:05 AM
మాదక ద్రవ్యాల వినియోగా న్ని పూర్తిగా అరికట్టేందుకు వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగా హన కల్పించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మే 26 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్రవ్యాల వినియోగా న్ని పూర్తిగా అరికట్టేందుకు వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగా హన కల్పించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను అదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జిల్లా డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం, రవాణా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి అదనపు కలెక్టర్ జిల్లాస్ధాయి నార్కోటిక్ కంట్రో ల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులు, మాదక ద్రవ్యాల సాగు నివారణ చర్యలు, విద్యార్థులు, యువత డ్రగ్స్ వినియోగించకుండా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి వారికి వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనర ల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రంలో బాధితు లకు చికిత్స, మానసిక పరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడు తూ జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, విద్యాసంస్థ లు, పబ్లిక్ ప్రదేశాల్లో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నా రు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, కార్మిక శాఖ అధికారి నజీర్‌అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ పాల్గొన్నారు.