ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:50 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అములచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లాలో త్వరగా పూర్తి చేయించి, ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అములచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లాలో త్వరగా పూర్తి చేయించి, ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ముందుగా ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 6465 ఇళ్లకు ముగ్గు పోశామని, 5479 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో, 4858 గోడల స్థాయిలో, 4585 స్లాబ్ స్థాయిలో ఉన్నాయని, 3934 ఇళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు. ముగ్గు పోసిన వారితో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశిం చారు. జిల్లాలో గుడిసెల్లో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, త్వరగా నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కింద మంజూరైన ఇళ్లపై ఆరా తీసి వాటి పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఎంపీడీవో ఇళ్ల పురోగతిని పరిశీలించాలని సూచించారు. పురోగతిలో ఉన్న ఇళ్ల ఫొటోలు ఎప్పటిక ప్పుడు హౌసింగ్ ఏఈలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని వెల్లడించారు. ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమావేశ మై వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించా లన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా వివ రించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో ఇళ్ల నిర్మాణాలను ప్రణాళిక ప్ర కారం పూర్తిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉత్త మ పనితీరు ప్రదర్శించిన బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల అధి కారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖాజా ముజాఫరుద్దీన్, జిల్లా పంచా యతీ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.